Jun 26,2023 22:57

  • యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-నందిగామ
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులని చేర్చించే బాధ్యత , తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షలు ఎన్‌. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం నందిగామ యుటిఎఫ్‌ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ మండలంలోని వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కషి ఉపాధ్యాయులు కషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు. జిఓ117ను ప్రభుత్వం విద్యా సంస్కరణలలో భాగం తీసుకు వచ్చిందని, దీని ఫలితంగా పాఠశాలల సంఖ్య కుదించటం, ఉపాధ్యాయుల సంఖ్యను కుదించుటకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. గత సంవత్సరం ప్రాథమిక పాఠశాలలు నుండి 3,4,5 తరగతులను తొలగించుటవలన ప్రాథమిక పాఠశాలలు బలహీన పడిపోయాయని ఆరోపించారు. 1,2 తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో విద్యార్థులను చేర్చటానికి వచ్చిన తల్లిదంఉడులు సుముఖత చూపడం లేదని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం జిఓ 117 ను రద్దు చేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలవాల సుందరయ్య, కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు, జిల్లా కౌన్సిలర్‌ కుంచం లక్షినారాయణ, నరసింహారావు పాల్గొన్నారు.