Dec 30,2022 23:11

ప్రజాశక్తి-విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యా విప్లవానికి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాంది పలికారని రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్‌ సింగ్‌ నగర్లోని ఎం.కె.బేగ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 183 మంది 8 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, స్థానిక కార్పొరేటర్‌ షాహినా సుల్తానాలతో కలిసి శుక్రవారం ఆయన ట్యాబ్‌ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది మాట్లాడుతూ.. సంపన్న దేశాలకు మాత్రమే పరిమితమైన డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ను పేద విద్యార్థులకు చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు గ్లోబలైజేషన్‌ లో పోటీ పడేందుకు డిజిటల్‌ విద్య ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు పి.వెంకటేశ్వరరావు, పేరంట్స్‌ కమిటీ చైర్మన్‌ అశోక్‌, నాయకులు ఎండి హఫీజుల్లా, కొండా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అరండల్‌ పేట ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 23 మంది విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్‌ బంకా శకుంతల భాస్కర్‌తో కలిసి మల్లాది విష్ణు ట్యాబ్‌ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్‌, నాయకులు అబ్దుల్‌ నజీర్‌, నాగేశ్వరరెడ్డి, యక్కల శంకర్‌, యక్కల మారుతి, మహమ్మద్‌ రఫీ, లక్ష్మణ, ఉల్లి ప్రసాద్‌, చల్లా సుధాకర్‌ పాల్గొన్నారు.