May 25,2023 23:53

ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న కార్పొరేటర్‌ కెల్ల సునీత

ప్రజాశక్తి - ఆరిలోవ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం వార్డు పరిధిలోనిామక్రిష్ణాపురం డాక్టర్‌ అంబేడ్కర్‌ గ్రామ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో 'ప్రభుత్వ పాఠశాలల ముద్దు, ప్రయివేటు స్కూల్‌ వద్దు, ప్రభుత్వ పాఠశాలలో విద్య, భవిష్యత్‌కు వెలుగు' అనే నినాదంతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనబడి నాడు నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రయివేటుకు ధీటుగా అభివృద్ధి చెందాయని, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, అమ్మ ఒడి వంటి పథకాలు అందరికీ వర్తిస్తాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అమ్మి రాజు, వార్డు వైసిపి ఇన్‌చార్జ్‌ కెల్ల సత్యనారాయణ, స్థానిక సంఘం అధ్యక్షులు వంకర బాబూరావు, కాకర గోవిందు, రండి గడ్డం నాయుడు, వీరబాబు, వెంకటేశ్వరరావు, సింహాచలం, స్కూలు కమిటీ చైర్మన్‌ ఎస్‌కె ఫాతిమా, వైస్‌ చైర్మన్‌ ప్రమీల పాల్గొన్నారు.