- సోషల్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం
- పలాస ఎంఇఒ-2కు షోకాజ్ నోటీసు
ప్రజాశక్తి - పలాస: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గదికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు పాడి రఘురాంకృష్ణ హాజరు పట్టికలో సంతకం చేయడం చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలను తరచూ సందర్శించి రికార్డులను పర్యవేక్షించడంలో అలక్ష్యం వహిస్తున్నారని ఎంఇఒ-2 సత్యంను మందలించారు. విధుల్లో అలసత్వం వహించిన ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. కలెక్టర్ వెంకట టి.సీతారామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, తహశీల్దార్ మధుసూదన్ ఉన్నారు.










