Apr 01,2023 23:02

 ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్‌
ప్రజాశక్తి-జగ్గయ్యపేట :
జగ్గయ్యపేట పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యాలయం శనివారం ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు వేలకు వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌ విద్యాసంస్థలు చదవాల్సిన పరిస్థితి నెలకొన్నది అన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటు కళాశాలగా మార్చిన పరిస్థితి ఉందని, దీనితో విద్యార్థులు అనేక మార్లు ఆందోళన చేసినప్పటికీ కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు సామినేని. ఉదయభాను పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందించే కోసం ప్రభుత్వ కళాశాలలును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ లో ఉన్న జగనన్న విద్యాదివేన, వసతి దీవన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు, జగ్గయ్యపేట మండల అధ్యక్షుడు ఎం.రాజు, మండల కార్యదర్శి ఎస్‌.ప్రణయతేజ తదితరులు పాల్గొన్నారు.