
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నం నియోజకవర్గం పెదపట్నం గ్రామంలో ప్రభుత్వం నీళ్లు అందించక సుమారు 1000 ఎకరాలు మేర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వాపోయారు. గురువారం పెదపట్నం గ్రామంలో పర్యటించి నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను కొల్లు రవీంద్ర పరిశీలించారు.ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎకరాకి 30 నుంచి 35 వేల రూపాయలు ఖర్చుపెట్టిన నీళ్లందక పొలాలు బీటలు వారే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభల్లో ప్రసంగాలు ఇవ్వడానికి తప్ప పరిపాలనికి పనికిరాని వ్యక్తిగా తయారయ్యారు. ఈ ముఖ్యమంత్రి స్వార్ధ రాజకీయాలు వలన కష్ణా జలాలపై హక్కును పోగొట్టుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనింగ్ మాఫియా మీద తప్ప రైతులుకు సరైన సమయంలో నీళ్లు అందించే పాపాన పోలేదన్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే రైతులకు నీళ్లు అందించి ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలుకుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో కష్ణా జిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, మీనవెల్లి నాగేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.