Oct 06,2023 23:12

 మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌
ప్రజాశక్తి-అవనిగడ్డ
: నది జలాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్లక్ష్యం రాష్ట్ర ఎడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన టిడిపి దీక్షా వద్ద మాట్లాడారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వ్యవహారం పున పరిశీలన చేయమని బ్రిజిష్‌ కుమార్‌ క్రిమినల్‌ కు అప్పగించిందని ఫలితంగా రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. అయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమస్యపై ఎవరిని కలవలేదని ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకి ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. జగన్‌ ఎంతసేపు తన అక్రమ వ్యవహా రాలపై కేంద్రం దష్టి పెట్టవద్దని, చంద్రబాబు అరెస్టును సమర్థించాలని, వివేక హత్య కేసులో చర్యలు వేగవంతం చేయవద్దని, అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయవద్దని, తనపై ఉన్న లక్ష కోట్ల అక్రమ సంపాదన కేసులు విచారణకు రాకపోవడం మాత్రమే జగన్మోహన్‌ రెడ్డికి చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే నిర్ణయాలు జరుగుతుంటే నీరో చక్రవర్తి లాగా జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నాడని బుద్ధ ప్రసాద్‌ విమర్శించారు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైల్లో పెట్టించడం, లోకేష్‌ ని అరెస్ట్‌ చేయాలని ప్రయత్నించడం, పవన్‌ కళ్యాణ్‌ పై తన అనుచరులతో బురద జల్లించే ప్రయత్నాలు చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని సాగానంపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ప్రజలకు బుద్ధ ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు .