
కళాశాలను సందర్శిస్తున్న వైస్ ఛాన్స్‌లర్ అంజిరెడ్డి
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలను ఆంధ్ర కేసరి విశ్వ విధ్యాలయం వైస్ ఛాన్సెలర్ ఎం.అంజిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కెవిఎన్.రాజు శుక్రవారం ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కళాశాలలోని సౌకర్యాల పట్ల ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీధర్ నాయుడు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.ప్రదీప్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.