
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల తహశీల్దార్ పి.సతీష్ పేదలకు కేటాయించిన లేఅవుట్లను శనివారం పరిశీలించారు. పుట్ట దగ్గర, కోత మిషన్ల వద్దనున్న లేఅవుట్లను పరిశీలించి లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. కోత మిషన్ వద్ద నుంచి వర్షం నీరు ప్రవహించే వాగు అలైన్‌మెంట్ మార్చి నీటి ప్రవాహానికి ఇబ్బంది కలగజేసే నిర్మాణాలను పరిశీలించారు. వాటిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విఆర్‌ఒ, సర్వేయర్‌కు సూచించారు. అలాగే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయుటకు స్థలమును, సంత బజార్‌లోని ఆక్రమణలను, వసంత నగర్ కాలనీలోని అక్రమణాలను పరిశీలించారు. ఆక్రమణలపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పరిశీలనలో సర్వేయర్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఉక్కుర్తి వెంకట్రావు, రుద్ర, శివాజీ పాల్గొన్నారు.