Aug 22,2023 19:11

ప్రజాశక్తి - ముసునూరు
    రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల కార్యక్రమాలపై సమీక్షించాలని నూజివీడు సబ్‌కలెక్టర్‌ ఆదర్శ్‌రాజేంద్రన్‌ తెలిపారు. మంగళవారం ముసునూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మండల శాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులతో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్‌ దాసరి సుధ, ఇఒపిఆర్‌డి బసవరాజు అచ్యుత సత్యనారాయణ, ఎంపిడిఒ ఆఫిస్‌ ఎఒ కూచిపూడి సాయిరామ్‌, సీనియర్‌ ఆసిస్టెంట్‌ ఎస్‌.శ్రీనివాసరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ సన్నీరాజన్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.