సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపీడీవో రమణమూర్తి
ప్రజాశక్తి-పంగులూరు: కలెక్టర్ ఆదేశాల మేరకు, గురువారం పంగులూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఎంపీడీవో రమణ మూర్తి పరిశీలించారు. మొదటగా పంగులూరు సచివాలయం-2ను ఆయన తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించా రు. విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి బాలబాలికల విద్యాభ్యాసం, భోజనం, వసతులు పరిశీలించారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నిర్మాణం వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌కు సూచనలు చేశారు. పంగులూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి లాం సునీత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










