వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోనిలో ఆర్‌ఐఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడారు. నాడు-నేడు నెపంతో సమయపాలన పాటించని కొంతమంది ప్రిన్సిపల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని, అధిక ఫీజులు వసూలు చేసే ప్రయివేట్, కార్పొరేట్ కళాశాలల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్, నాగరాజు, గౌస్, దినేష్, రాజు, మహేష్ పాల్గొన్నారు.










