
బి.కొత్తకోట : మండలంలో కబ్జాకు కాదేదీ అనర్హం అంటూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కాలవలు యథేచ్ఛగా అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ సమీపంలో కాండ్లకుంట చెరువు కట్టకు ఆనుకుని ఉన్న పలు కాలవలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, పట్టణంలోని మదనపల్లి రోడ్డులోని పోలీస్ స్టేషన్ సమీపంలో వెంకటేశ్వర కల్యాణ మండపానికి వెళ్లే దారిలో ఒకటవ సచివాలయం భవనం నిర్మిస్తున్న చోటచెరువుకు అనుకొని గహాలతోపాటు షెడ్లు కూడా నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదు. గతంలో కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఇన్‌ఛార్జి కమిషనర్ వెంకట్రామయ్య చొరవ తీసుకుని బెంగళూరు రోడ్డులో కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసినా ప్రయోజనం లేకుండాపోయింది. అక్రమ కట్టడాలకు కొంతమంది నాయకులు అండగా నిలవడంతో కూల్చివేసిన కట్టడాలు సంగతి ఏమైందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ పట్టణంలోని కాండ్లకుంట చెరువు సమీపంలో ఉన్న 315 సర్వే నెంబరులో కాలువగా ఉండగా ఆ కాలువపై అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా రెండు రోజులు ప్రభుత్వ సెలవులు దినం కావడంతో మోల్డింగ్ సైతం వేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడం, ఆక్రమించుకొని ఇల్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం శోచనీయం. ఈ విషయమై నగర పంచాయతీ కమిషనర్‌కి ఫోన్‌లో వివరణ కోరగా ఈ విషయం ప్రజలు తమ దష్టికి తీసుకువచ్చారని, సర్వే నెంబర్లు 315లో కాలువపై మోల్డింగ్ వేసేందుకు సిద్ధమైన నిర్మాణాన్ని ఆపివేశామని,ఈ విషయమై మండల తహశీల్దార్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వివరించారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. పట్టణంలోనే కాదు బి.కొత్తకోట మండలంలో పలు ఆక్రమణలు జరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా అక్రమణలను తొలగించాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడమే ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ బి.కొత్తకోట మండలంపై ప్రత్యేక దష్టి సారించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.కాండ్ల చెరువు కాలువపై వెలసిన భవనం