Sep 07,2023 18:20

ఉట్టికొట్టి రూ.500 గెలుచుకున్న విద్యార్థి
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
    స్థానిక చత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎన్‌.ప్రసాద్‌బాబు అధ్యక్షతన విద్యార్థులచే ఉట్టు కొట్టించే కార్యక్రమం నిర్వహించారు. టి.దుర్గాప్రసాద్‌ బిఎ పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థి ఉట్టు కొట్టి రూ.500 నగదు గెలుపొందాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ విద్యార్థులకు సాంప్రదాయ క్రీడలపై అవగాహన ఉండాలని సూచించారు. కళాశాలలో అన్ని రకాల సాంప్రదాయ కలలు, క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. చదువుతోపాటు సంతోషాన్ని పంచుకోవాలని, అన్ని సంబరాల్లోనూ విద్యార్థులందరూ కలిసికట్టుగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ బి.శ్రీనివాసరావు, కళాశాల కల్చరల్‌ క్లబ్‌ కోఆర్డినేటర్‌ సిహెచ్‌.రమాదేవి, సభ్యులు డా.జివి.లాల్‌, పిఎస్‌.రావు, వి.హనుమంతరావు, కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎన్‌.వినరు, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.