ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణ ఎంపికల్లో 13 మంది ఎంపిక
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్, కెమిస్ట్రీ విభాగం, బయోసైన్స్ రీసర్చ్ ఫౌండేషన్ సంస్థ, కాంచీపురం వారి సంయుక్త ఆధ్వర్యం లో ట్రైనీ సైంటిస్ట్స్, అనలిటికల్ కెమిస్ట్ ఉద్యోగాల కోసం బుధవారం కళాశాల లో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 27 మంది అభ్యర్థులు హాజరుకాగా 13 మంది ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసులు రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ వి వీరయ్య, ఐక్యూఏసి కొర్డినేటర్ డా పీ సుజన, జేకేసి సమన్వయకర్త సంధ్య ఆదూరి, కెమిస్ట్రీ డిపార్టుమెంట్ ఇంచార్జ్ డా పిహరి బాబు, డా. యం శంకర్ రావు, సమన్వయకర్త ఎం యస్ సి కెమిస్ట్రీ, రమేష్ బాబు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఎస్‌ఐఏ జిడిసి శ్రీకాళహస్తి, జేకేసి ఎఫ్‌ఎం టి. కిషోర్, ఇతర అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.










