Dec 06,2022 23:36

మాట్లాడుతున్న గిరిజన సంఘం మండల కార్యదర్శి అజరుకుమార్‌

ప్రజాశక్తి - ఎటపాక
మండలంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ, దేవస్థానం భూములను కచ్చితమైన సర్వే చేసి, లెక్కలు తేల్చి శ్వేత పత్రం విడుదల చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి ఇర్పా అజరు కుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కాక అర్జున్‌ దొర డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటపాక ఏజెన్సీలో పీసా గ్రామసభలు నిర్వహించకుండా, అనుమతులు లేకుండా, 1/70 చట్టాలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా గుండాల పంచాయతీలో జరుగున్న ఇసుక ర్యాంపులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి పటిష్టమైన ఏజెన్సీ చట్టాలను రక్షణ కలిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు అపకా సమ్మక్క, సోయం వీరమ్మ, కారం నాగేష్‌, పెనుబల్లి భీస్మారావు, సీసం కొండ, ఇర్పా కోటి, మాటూరి బాలు, ఇరపా హరి తదితరులు పాల్గొన్నారు.