Aug 21,2023 21:42

ఫొటో : భవనాలను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ప్రభుత్వ భవనాలు ప్రారంభం
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మండలం పరిధిలోని గౌరవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రం భవనాలను సోమవారం ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. గౌరవరం సర్పంచ్‌ దేవరపల్లి మహేంద్ర రాధిక దంపతుల నేతృత్వంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిథిగా ఎంఎల్‌ఎ హాజరయ్యారు.
ఎంఎల్‌ఎకు అడుగడుగునా మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా వారి కుటుంబంలోకి ఆహ్వానించారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన వారి యోగక్షేమాలను కనుక్కొని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ అందిస్తున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు తరితర వివరాలలో కూడిన పోస్టర్లను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో చింతం బాబుల్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాసరెడ్డి, ఆర్‌డిఒ శీనానాయక్‌, ఎంపిడిఒ కృష్ణమోహన్‌ రావు, తహశీల్దారు మాధవరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ రవి, జెడ్‌పిటిసి జంపాని రాఘవులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మెప్మా అధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.