ప్రజాశక్తి-అమలాపురం
స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం, పి.గన్న వరం నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలకు సంబంధించి మండలాలు వారీగా మూడు కేటగిరీలు భవనాల నిర్మాణాల పురోగతిని ఎంపిడిఒలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలలో ముందంజలో ఉన్న ఆత్రేయపురం, ఆలమూరు మండ లాలకు చెందిన ఎంపిడిఒలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లను శుక్లా అభినందిం చారు. మిగిలిన మండలాలకు చెందిన అధికారులు పనితీరు మెరుగుపరుచుకుని కాంటాక్ట్ ఏజెన్సీల సమన్వయంతో స్టేజ్ కన్వర్షన్ ద్వారా ఆశించిన పురో గతిని సాధిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మాణం కూడా పూర్తి చేసి అమూల్ ద్వారా పాల సేకరణ కొరకు అందుబాటులో తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.చంటిబాబు, కార్యనిర్వాహక ఇంజినీర్ రాజకుమార్, ఎంపిడిఒలు ఎన్.బుజ్జి, జాన్ లింకన్, జె.వెంకటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, మహేశ్వరరావు, పంచా యతీరాజ్ డిఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.










