Aug 22,2023 18:35

తహశీల్దార్‌తో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి

ప్రజాశక్తి - లింగసముద్రం : ఆక్రమణలకు గురౌతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వివిధ గ్రామాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు .అర్జీలను వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్‌ మీరావలికి సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆక్రమణలు జరిగాయని, వాటిని విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. చీమలపెంటలో సర్వే 92/2లోని ఎ 5.66 సెంట్లు ఆన్‌లైన్‌ చేశారని, మొత్తం విస్తీర్ణంలో ఆర్‌అండ్‌బి రోడ్డును కూడా ఆన్‌లైన్‌ చేశారన్నారు. రోడ్డును ఆన్‌లైన్‌ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తిమ్మారెడ్డి పాలెంలో మాల్యాద్రి లక్ష్మినరసింహ స్వామి భూములను ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తారని ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి చెప్పారు. ఆక్రమణదారులకు ఒక నోటీసు ఇచ్చి 14 రోజులు తర్వాత వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తొలగింపులు ఉంటాయని వివరించారు. తిమ్మారెడ్డిపాలెం నుంచి యర్రారెడ్డిపాలెం మీదగా అయ్యవారిపల్లె వరకు 7. 77 కోట్లతో మంజూరు అయిన రోడ్డుకు టెండర్‌ పిలిచినట్లు తెలిపారు. తహశీల్దార్‌ మీరావలి, ఎంపిడిఒ శేషుబాబు, వైసిపి మండల కన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ వరికూటి క్రిష్ణారెడ్డి,కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ షఫి,సర్పంచ్‌లు,ఎంపిటిసి దగ్గు వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ రాఘవులు, వైసిపి నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వర్లు, క్రిష్ణారెడ్డి,వెన్నపూస బ్రహ్మరెడ్డి,నాగేశ్వరరావు ఉన్నారు.