ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సమిష్టి బాధ్యతతో కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు, జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఇందుకు నియోజకవర్గాల వారీగా సమీక్షించాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తొలిసారిగా సత్తెనపల్లిలో సమీక్షిస్తున్నామన్నారు. మంత్రి రాంబాబు మాట్లాడుతూ పట్టణంలో జిల్లా పరిషత్, దేవాదాయ భూముల్లో 50-60 ఏళ్ల నుండి ప్రజలు ఇళ్ళు నిర్మించుకుని నివశిస్తున్నారని, వారికి నామమాత్రపు ధరకు రెగ్యులరైజషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాతబస్టాంండ్‌లో 7.8 ఎకారాల సోలస ఆంజనేయ స్వామి దేవాలయ భూముల్లోనూ 50-60 ఏళ్లుగా భవనాలు నిర్మించుకుని ఉంటున్నారని అన్నారు. నామమాత్రపు ధరకు వారికి రెగ్యులరైజషన్ చేస్తే లబ్ధిదారులకు మేలు జరగటంతో పాటు దేవాదాయ శాఖకు ఆదాయం వస్తుందన్నారు. దీనిపై దేవాదాయ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దేవాలయ భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని వివరించారు. ఇన్‌ఛార్జి మంత్రి మాట్లాడుతూ దేవాదాయ భూములు, జిల్లా పరిషత్ భూములపై ప్రతిపాదనలు పంపించాలని, మంత్రి మండలిలో తీర్మానం చేసి నిర్వాసితులకు మేలు చేస్తామని అన్నారు. నాడు-నేడు రెండో దశ పనులు, ఆర్ అండ్ బి, గృహ నిర్మాణం, విద్యుత్, సమస్యలపై చర్చిం చగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాంలో రెవిన్యూ, విద్యుత్, పంచాయ తీరాజ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నా యని, వచ్చిన ప్రతి దరఖాస్తునూ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు దారుతో సావదానంగా మాట్లాడి సమస్య లను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జెసి శ్యామ్ ప్రసాద్, డిఆర్‌ఒ వినాయకం, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, డిఇఒ శ్యామ్యూల్, డిఆర్‌డిఎ పీడీ బాలు నాయక్, డిపిఒ భాస్కర్‌రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ రాజానాయక్, జిల్లా వ్యవసాయా ధికారి మురళి, పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి.శ్రీని వాస్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసరావు, ఆర్‌డిఒ రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
సమస్యలకు 15 రోజుల్లో పరిష్కారం
ప్రజాశక్తి - పెదకూరపాడు : పెదకూరపాడు నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షలో పలు అంశాలను ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తెచ్చారు. ఇళ్ల స్థలాలు అందని పేదలు ఇంకా ఉన్నారని, వారికి మంజూరు చేయాల న్నారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు కాని పది గ్రామాల్లోని అర్హులతో పాటు అన్ని గ్రామాల్లో అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సొంత స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకోదలచిన 2894 మందికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అత్యవసర పనుల నిమిత్తం డీఎంఫ్ నిధులు రూ.3 కోట్లు ఇవ్వాలని కోరారు. అచ్చంపేట మండలం సండ్రతండాకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వాలని, ఎమ్మాజీగూడెం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లు విడుదల చేయాలని, బెల్లంకొండ మండలం రామాంజనేయపురంలో సిమెంట్ రోడ్లు, బోర్లు వేయడానికి అనుమ తులివ్వాలని కోరారు. నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్ల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం కోసం నిధులు, సీపీఎస్ స్కీమ్ మెయింటెనెన్స్ కోసం నిధులు, జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 75 తాళ్లూరు నుంచి తమ్మవరం వరకు, అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి పులిచింతల డ్యామ్ వరకు పంచాయతీ రాజ్ తారు రోడ్లు నిర్మాణానికి నిధులివ్వా లన్నారు. కొన్ని గ్రామాల్లో శ్మశానాలకు స్థలం కేటాయించాలని కోరారు. మాదిపా డుకు మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చింతపల్లిలో నిర్మించాలన్నారు. లంక భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అచ్చంపేట మండలం కొండూరులో చెరువు భూమిలో వ్యవసాయం చేసుకుం టున్న వారికి, చామర్తి రోడ్డు డొంకలో ఇళ్లేసుకుని ఉంటున్న వారికి, క్రోసూరు మండలం అందుకూరులో దేవాదాయ భూమిలో ఇళ్లేసుకుని ఉంటున్న వారికి పట్టాలివ్వాలని కోరారు. క్రోసూరు పాలిటె క్నిక్ కాలేజీ ప్రహరీతో పాటు లెవలింగ్‌కు నిధులివ్వాలని కోరారు. ఓటీఎస్ స్కీమ్ కింద డబ్బు కట్టిన వారికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అంగన్‌వాడీ, అదనపు తరగతి గదుల నిర్మాణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మంత్రి స్పందిస్తూ తమ పరిధిలో ఉన్న సమస్యలకు 15 రోజుల్లో పరిష్కరిస్తామని, మిగతావాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.










