Nov 15,2022 00:05

అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది

ప్రజాశక్తి- సబ్బవరం : జివిఎంసి 88వ వార్డు వెదుర్లనరవలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ సిబ్బంది సోమవారం తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ బి.సత్యనారాయణ మాట్లాడుతూ వెదుర్లనరవ సర్వే నెంబర్‌ 35లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రహరీని, సర్వే నెంబర్‌ 128 డి.పట్టా భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్‌లను తొలగించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిటి వెంకట్‌, వీఆర్వో వెంకటేష్‌, సర్వేయర్‌ కె.శ్రీనివాసరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.