
ప్రజాశక్తి -రావికమతం: సర్వే నిర్వహించిన గ్రామాలలో ముందుగా ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి సర్వే రాళ్లను వేయాలని నర్సీపట్నం ఆర్డీవో జయరామ్ సూచించారు. మండలంలోని గుమ్మాలపాడు గ్రామంలో ఫీల్లింగ్ చేస్తున్న సర్వే రాళ్ల విధానాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ, ఇప్పటికే సర్వే నిర్వహించిన గుమ్మాలపాడు, చినపాచీల, కవగుంట, తదితర గ్రామాలలో స్టోన్ సర్వే ఫిల్లింగ్‌ను వేగ వంతం చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ భూములకు, చెరువులకు సర్వే రాళ్లు ఆయా హద్దులలో వేయడం జరుగుతుందన్నారు. దీంతో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ సతీష్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఏపీవో కాశి, సర్పంచ్ బంటు సన్యాసినాయుడు, ఎంపీటీసీ బంటు శ్రీనివాసరావు, వీఆర్వో మురళి తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీ
రోలుగుంట:స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి.జయరాం సందర్శించారు. రీ సర్వేపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను తహశీల్దార్ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు.