Aug 21,2023 22:53

చదును చేస్తున్న ప్రొక్లెయినర్‌

* ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు
ప్రజాశక్తి- రణస్థలం: 
అధికారం ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు. కోర్టు ఆదేశాలు ఖాతర్‌ చేయాల్సిన అవసరం లేదు. అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో దజ్జా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. దీని ఫలితంగా రూ.5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి దర్జాగా వైసిపి నాయకుడు కబ్జాకు పాల్పడ్డా డు. మండల కేంద్రంలో జె.ఆర్‌.పురం పంచాయతీ పాత పోలీస్‌ స్టేషన్‌ వెనుక భాగం, ప్రస్తుతం ఎంపియు పి స్కూల్‌ ముందుభాగం రావాడ రోడ్డుకు ఆనుకొని ఉన్న సర్వే నంబరు-2లో 18 సెంట్లు గ్రామకంఠం ఉంది. అయితే ఈ భూమిని గతంలో ఓ టిడిపి నాయకుడు ఆక్రమించుకొని భూ మిని కొన్నేళ్లు అనుభవించాడు. అయితే సదరు భూమి నాదే నని వైసిపి నాయకుడు ముందుకొచ్చాడు. విజయనగరం మ హరాజుల దగ్గర భూమి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ కాగితాలు చూపించి ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ సంద ర్భంలో టిడిపి నాయకులు కోర్టుకు వెళ్లారు. రెవెన్యూ అధికా రులు కూడా గ్రామకంఠమని రికార్డులను కోర్టుకు అందజే శారు. దీంతో ఈ స్థలంపై టిడిపి నాయకులకు ఎటువంటి హక్కు లేదని కోర్టు నిర్ధారించింది. ఇలా ఉండగా... ఇటీవల దిగువ కోర్టు రిజిస్ట్రేషన్‌ కాగితాలు ఉన్న వైసిపి నాయకునికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఉన్న 18 సెంట్లు భూమి గ్రామకంఠంగా అధికారులు కోర్టుకు తెలిపారు. సదరు ఇద్దరి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు కేసులు పెండింగ్‌ ఉంచింది. హైకోర్టులో ఉన్న వివాదాన్ని వైసిపి నాయకుడు ఈ భూమి ఆక్రమించే ప్రయత్నం చేశారు. సోమవారం వంద మందికి పైగా తమ అనుచరులను తెప్పించి ఆ స్థలంలోని పురాతన చెట్లను తొలగించి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా భయబ్రాంతులతో ఏం జరుగుతుందన్న ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం సదరు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలిసినా ప్రేక్షకుని పాత్ర వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నా పోలీసులు ఆ స్థలంలోకి వెళ్లి వైసిపి నాయకులకు వత్తాసు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల ను రక్షించాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు వత్తా సు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
హైకోర్టులో కేసు ఉంది
జె.ఆర్‌.పురం పంచాయతీ సర్వే నంబరు-2లో 18 సెంట్లు గ్రామకంఠం భూమి హైకోర్టులో పెండింగ్‌ ఉంది. ప్రస్తుతం ఈ భూమి పైకి ఎవరికీ ఎటువంటి హక్కులు లేదు. ఈ భూమిపై కోర్టు ఆదేశాల ప్రకారం ఎటువంటి నిర్మాణాలు గాని, ఆక్రమణలు గాని చేపట్టరాదు. ఈ భూమికి సంబంధించి పంచాయతీ అధికారులూ స్పందించాలి. ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే కోర్టు ఆదేశాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- సనపల కిరణ్‌కుమార్‌, తహశీల్దార్‌
ఎటువంటి ఫిర్యాదూ రాలేదు

జె.ఆర్‌.పురం పంచాయతీ సర్వే నంబరు-2లోని గ్రామ కంఠంలో 18 సెంట్ల భూమికి సంబంధించి ఒక ప్రయివేటు వ్యక్తికి, ప్రభుత్వానికి మధ్య వివాదం ఉన్నట్లు తమకు ఫిర్యాదు అందింది. అయితే సంబంధించిన కేసు హైకోర్టులో ఉండడంతో ఈ స్థలంపైకి ఎవరూ వెళ్లకూడదని నిబంధన ఉంది. అయితే ఈ స్థలంలో ఆక్రమణకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారులు గాని, సంబంధిత అధికారులు గాని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆక్రమణదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- రాజేష్‌, ఎస్‌ఐ