కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన విశాఖ నగరంలో బుధవారం పలుచోట్ల నిరసనలు చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను, చెత్తపై యూజర్ ఛార్జీలను రద్దు చేయాలని పెద్దపెట్టున నినదించారు. వార్డు సచివాలయాలు, నివాస ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజాశక్తి - యంత్రాంగం
ఎంవిపి.కాలనీ : జివిఎంసి 22వ వార్డు పిఠాపురం కాలనీ సచివాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు మాట్లాడారు. ట్రూఅప్, ఫిక్సిడ్, కస్టమర్ ఛార్జీల పేరిట ప్రజలను బాధించడం సరికాదన్నారు. నాయకులు జివిఎన్.చలపతి, జి.రమణ, ప్రదీప్, కుమార్ మంగళం, అనపర్తి అప్పారావు, కె.కుమారి, పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ : చెత్తపై యూజర్ ఛార్జీలతో ప్రభుత్వ పథకాలను లింకు పెట్టడం తగదని సిపిఎం సీనియర్ నాయకులు వై రాజు, జి.అప్పలరాజు అన్నారు. బుధవారం వెంకటేశ్వర థియేటర్ వద్దగల జివిఎంసి జోన్ 4 కార్యాలయం వద్ద సిపిఎం జగదాంబ జోన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.నరసింగరావు, ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు.
కంచరపాలెం : జివిఎంసి 56వ వార్డు పరిధి మల్లసూరివీధి, 54వ వార్డు పరిధి రవీంద్రనగర్ సచివాలయాల వద్ద సిపిఎం కంచరపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ నాయకులు ఒ.అప్పారావు, ఎం.ఈశ్వరరావు, ఎన్.మోహన్, డి.పైడిరాజు, ఎమ్.సంతోషి, ఎస్.అప్పలరాజు, పార్వతి, సూరి, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : జివిఎంసి 10వ వార్డు పరిధి రవీంద్రనగర్ బస్‌స్టాప్ వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పాలన అంటూనే ప్రజలపై తీవ్ర భారాలు వేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కమిటీ సభ్యులు డి.నాగరాజు, పి.శంకరరావు, బి.గౌరి, జి.నాగరాజు, రమణ, తవిటినాయుడు, సూర్యనారాయణ తదితలు పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 45వ వార్డు పరిధి తాటిచెట్లపాలెంలోని సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కయ్యపాలెం జోన్ కార్యదర్శి రాజు, నాయకులు గౌరీష్, లక్ష్మీపతి, జ్యోతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : జివిఎంసి 40వ వార్డు పరిధి ఎకెసి కాలనీ, 58వ వార్డు పరిధి గుల్లలపాలెం, 59వ వార్డు పరిధి నెహ్రూనగర్, 62వ వార్డు పరిధి త్రినాధపురం, దుర్గానగర్, ఎఎస్‌ఆర్ కాలనీ, 63వ వార్డు పరిధి చింతల్లోవ సచివాలయల వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు కె.పెంటారావు, ఆర్.లక్ష్మణమూర్తి, జె.రామునాయుడు, ఆర్.విమల, బి.మమత, నిర్మల, కృష్ణవేణి, కె.నూకరాజు, బి.తాతాజీ, పి.రామారావు, బి.జగ్గునాయుడు, పి.వరలక్ష్మి, గురులక్ష్మీగణేష్, ఎ.చాయ, లకీëకాంతం, కె.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
62వ వార్డు పరిధి అల్లూరి సీతారామరాజు కాలనీ, దుర్గానగర్, త్రినాధపురంలో సిపిఐ ఆధ్వర్యాన ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. చెత్తపన్ను, పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్‌మీటర్లు రద్దుచేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐం నాయకులు గుడాల రాంబాబు, బద్దం సత్యానందరావు, గండి అప్పారావు, కె.శ్రీనివాస్, త్రినాథ్, బి.గోపాలరావు, నూనెల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : జివిఎంసి పరిధి గాంధీనగర్, దిబ్బపాలెం, దశమికొండ, చట్టివానిపాలెం, శ్రీనగర్, శ్రీరామ్‌నగర్, సుందరయ్యకాలనీ, అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, అప్పన్నకాలనీ సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు, నాయకులు ఎ.లోకేష్, వై.లక్ష్మణ్, ఎం.విజయరావు, పి.నర్సింగరావు, బి.అప్పారావు, జెసి.లక్ష్మి, ఎం.శ్రీదేవి, జి.లక్ష్మి, కెవి.రమణ, రాజు, పావని, ప్రసాద్, సత్యనారాయణ, డి.శ్రీనివాస్, లోకేష్, డి.రమణ, భాగ్యేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.వేణు, తాయారమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : జివిఎంసి 97వ వార్డు పరిధి సప్తగిరినగర్ సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్ మాట్లాడుతూ, అడగకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి, ఆ భారాలను ప్రజలపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపు తదితర భారాలు వేసిన జగన్మోహన్‌రెడ్డి పునరాలోచించకపోతే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, సిఐటియు నాయకులు అప్పలనాయుడు, శంకరరావు, ఐద్వా నాయకులు రజని తదితరులు పాల్గొన్నారు.










