ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ ఆసుపత్రిలోనే సులభతరహా కాన్పులు జరుగుతాయని అవే మహిళలకు సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీల్లో భాగంగా ఆయన పిహెచ్‌సిలో కాన్పు అయిన తల్లీబిడ్డలను పరిశీలించారు. హాస్పిటల్లో కాన్పు అయితే లభించే భరోసా గురించి తల్లికి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనీమియాతో బాధపడే గర్భిణులు, బాలింతలకు ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా రక్తహీనతను తొలగించగలమని ప్రతి గర్భిణికి, ప్రతి బాలింతకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఇవ్వాలన్నారు. అనంతరం వెంకట్రావు పల్లెలో నిర్వహిస్తున్న కుటుంబ డాక్టర్ వాహనాన్ని తనిఖీ చేసి సిబ్బందికి తగిన సలహాలు సూచనలు అందించారు. స్థానిక దిలార్ బారు వీధిలో వైద్యాధికారి శివ కల్పన ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది చేపడుతున్న అతిసారా జ్వరం కేసులపై సర్వేను వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మందికి చిరు వ్యాధులకు చికిత్సను పరిశీలించి సిబ్బందికి రోగులకు సలహాలు సూచనలను ఆయన చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య విద్యాధికారి కె వెంకటసుబ్బయ్య, సామాజిక ఆరోగ్య అధికారిని శివకుమారి, ఆరోగ్య పర్యవేక్షకులు చెన్నయ్య, పి.బి, ఎంఎల్‌హెచ్‌పి నాగార్జున, ఆరోగ్య కార్యకర్తలు శ్రీనివాసులు, జి శ్రీనివాసులు, రబ్బాని, బాలుడు, ఏఎన్‌ఎం జయమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










