Mar 10,2023 21:45

ప్రజాశక్తి - గణపవరం
             గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకోవాలని గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్‌నాయుడు, పి.కిరణ్మయి అన్నారు. స్థానిక పిహెచ్‌సిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిధిలోని 67 మంది గర్భిణులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ గర్భిణులు తప్పనిసరిగా నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకుని ఐరన్‌, కాల్షియం మాత్రలు వాడాలన్నారు. ప్రతి నెలా 9, 10 తేదీల్లో గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు చేస్తామని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణుల, పిల్లల పేర్లు నమోదు చేస్తామని చెప్పారు. అనంతరం సరిపల్లిలో డ్రై డే నిర్వహించారు. వైవి.లక్ష్మణరావు స్థానికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ జె.విల్సన్‌బాబు, ఆరోగ్య సహాయకులు గేదెల శ్రీనివాసు, అదపరెడ్డి కృష్ణ, ఎం.యోహాను, ఎఎన్‌ఎం వల్లి, ఎంఎల్‌హెచ్‌పి మౌనిక పాల్గొన్నారు.
సిహెచ్‌ అగ్రహారంలో డ్రైడే
మండలంలోని సిహెచ్‌ అగ్రహారంలో శుక్రవారం పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య సహాయకులు నామాల రాజు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు ఇంట్లోకి రాకుండా దోమతెరలు వాడాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్రవంతి, విఆర్‌ఒ మాధవి, ఎంఎల్‌హెచ్‌పి మాధురి ప్రకాష్‌, ఎఎన్‌ఎం ఏసమ్మ, ఆశా వర్కర్లు భవాని, పి.దుర్గ, వాలంటీర్లు గౌతమి, సాయి పాల్గొన్నారు.