ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహారం పంపిణీ
ప్రజాశక్తి-డోన్
డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆదివారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేసినట్లు ప్రార్థన సమయం నిర్వాహకులు జాన ప్రభాకర్ తెలిపారు.ప్రార్థన సమయం ద్వారా శ్రీ పరమేశ్వర పేపర్ ప్లేట్ ప్రోపరేటర్ జి వేదాంతంరెడ్డి ఆర్థిక సహాయంతో గర్భవతులకు బాలింతలకు రోగులకు రొట్టె పప్పు గుడ్డు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా జాన ప్రభాకర్ మాట్లాడుతూ ప్రార్థన సమయం ద్వారా మేము తలపెట్టిన ఈ కార్యక్రమము 50వ ఆదివారం సుదీర్ఘంగా కొనసాగుతుందని దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నామని రోగులు ఈ రొట్టె పప్పు గుడ్డు తీసుకోవడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు.










