Jul 02,2023 17:36

రొట్టె పప్పు గుడ్డు పంపిణీ చేస్తున్న జాన ప్రభాకర్

ప్రభుత్వ ఆసుపత్రిలో పౌష్టికాహారం పంపిణీ
ప్రజాశక్తి-డోన్

     ప్రార్థన సమయం ద్వారా డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు రొట్టె పప్పు గుడ్డు శ్రీ రాధాకృష్ణ స్వీట్ షాప్ ప్రోపరేటర్ చిదాంబరం ఆర్థిక సహాయంతో అందించడం జరిగిందని ప్రార్థన సమయం నిర్వాహకులు జాన. ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారము దాతల సహాయ సహకారాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి రొట్టె పప్పు గుడ్డు ఇవ్వడం జరుగుతుందని ఈ పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.