Nov 08,2023 21:40

ప్రసవం అనంతరం బిడ్డతో కలిసి ఇంటికి వస్తున్న కలెక్టర్‌ దంపతులు

ప్రజాశక్తి-పార్వతీపురం : జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సతీమణి కరుణ పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.వాగ్దేవి, ఆమె బందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. కరుణకు ఇది రెండో కాన్పు. మొదటి కాన్పు కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చారు. అప్పుడు నిశాంత్‌ కుమార్‌ రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు.