ప్రజాశక్తి-ఎడ్యుకేషన్
జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలన్న ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుండి ఖచ్చితంగా అమలు చేసేలా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలను ఆదేశించినట్లు జిల్లా విద్యా శాఖాధికారి సి.వి.రేణుక తెలిపారు. మాంటిస్సోరి కళాశాల ప్రాంగణంలోని విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం 12(1) (సి) ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం నుండి జిల్లాలో ఐబి, ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ, స్టేట్ సిలబస్‌లను అమలు చేస్తున్న అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలన్న ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 25 శాతం సీట్లలో అనాధ బాలలు, వికలాంగులు, హెచ్‌ఐవి బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఓసి, బీసి, మైనార్టీ వర్గాలలో నిరుపేదలకు 6 శాతం కేటాయించడం జరిగిందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల కొరకు ఏప్రిల్ పదో తేదీలోపు ష్ట్ర్‌్‌జూ://షరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.










