Apr 01,2023 00:46

యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ

ప్రజాశక్తి- నర్సీపట్నం రూరల్‌: ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డివి సత్యనారాయణ కోరారు. విజయలక్ష్మి దుర్గ ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అన్ని రంగాల వత్తిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్లకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను చర్చించుకునేందుకు కమ్యూనిటీ భవనానికి స్థలాన్ని మంజూరు చేయాలన్నారు.కోవిడ్‌ సమయంలో పనులు లేక ఆర్థికంగా చితికిపోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు మండవ కుటుంబరావు, ఉపాధ్యక్షులు కే.పాల్‌ రాజు, ప్రధాన కార్యదర్శి కే.శ్రీహరిరావు, కార్యదర్శి బి.మాదన్న, కోశాధికారి ఎం.శ్రీధర్‌ రవిబాబు, రాష్ట్ర కన్వీనర్‌ రమణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కనికెళ్ల కోటేశ్వరరావు, స్థానిక నాయకులు లంక వీరాపాత్రుడు, దేశెట్టి సత్యనారాయణ, బ్రహ్మాజీ పాల్గొన్నారు.