Oct 05,2023 00:26

ప్రైవేట్‌ బ్యాంకులకు ధీటుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌

ప్రైవేట్‌ బ్యాంకులకు
ధీటుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ : ప్రైవేట్‌ బ్యాంకులకు ధీటుగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పనిచేస్తోందని, ఖాతాదారులు సద్విని యోగం చేసుకోవాలని ఆ బ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ సూచిం చారు. గూడూరు పట్టణంలోని డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన రుణ విస్తరణకి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన బ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌, తదితరుల చేతులమీదుగా లబ్ధిదారులకు 7కోట్లా 23లక్షల రూపాయలకు సంబంధించిన నగదు చెక్కును అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ మాట్లాడుతై ప్రయివేటు బ్యాంకులకు ధీటుగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సేవలు అందిస్తోందన్నారు. అనేక రకాల రుణ సదుపాయాలున్నాయని, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఆర్‌ఎం మోహన్‌ రెడ్డి, లీడ్‌ మేనేజరు సుభాష్‌, చీఫ్‌ మేనేజరు ఆంజనేయులు పాల్గొన్నారు.