Sep 04,2021 06:07

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 24 ఞ 7 ఆసుపత్రులలో నర్సులు పారా మెడికల్‌ సిబ్బంది లేక పోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వద్ద, ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్ల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. కాన్పులు, సర్జికల్‌ ఆపరేషన్లు, శస్త్ర చికిత్సలు, చిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జనం వేలకు వేలు డబ్బు వెచ్చించి మోసపోతున్నారు. వైద్యుల కొరతతో పాటు, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది లేక పోవడం కలవరపెడుతోంది.
     భారతదేశంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం గ్రామీణ ఆరోగ్యం ఊతమిచ్చేలా ఆయుష్మాన్‌ భారత్‌ తదితర పథకాలు వచ్చాయి కానీ, తాజా ఆర్థిక సర్వే ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ ఎండమావిగానే మిగిలిపోయింది. అరవై శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పిహెచ్‌సిలు) కేవలం ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు, ఐదు శాతం ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు ఎవరూ లేరు. 30 శాతానికి పైగా పిహెచ్‌సిలలో తలుపులు తెరవడం లేదు. 20 శాతానికి పైగా పి హెచ్‌ సి లు వైద్యులు లేకుండా పనిచేస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం, ''కేవలం ఒక వైద్యునితో లేదా డాక్టర్‌ లేకుండా అధిక సంఖ్యలో పిహెచ్‌సిలు పనిచేసే జిల్లాలలో గ్రామీణ శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) మరియు మాతాశిశు మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్‌)ని సూచిస్తున్నాయి. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 24 ఞ 7 ఆసుపత్రులలో నర్సులు పారా మెడికల్‌ సిబ్బంది లేక పోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వద్ద, ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్ల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. కాన్పులు, సర్జికల్‌ ఆపరేషన్లు, శస్త్ర చికిత్సలు, చిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జనం వేలకు వేలు డబ్బు వెచ్చించి మోసపోతున్నారు. వైద్యుల కొరతతో పాటు, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది లేక పోవడం కలవరపెడుతోంది.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది ఉన్నప్పటికీ, ఆరోగ్య సేవలను అందించడంలో వారి భాగస్వామ్య స్థాయి, మందుల సరఫరా లేకపోవడం,డయాగస్టిక్‌ పరికరాల కొరత, మౌలిక సదుపాయాల లేమి, సిబ్బంది పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు .కేవలం 20 శాతం పిహెచ్‌సిలు మాత్రమే ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపిహెచ్‌ఎస్‌) పాటించాయని సర్వే తెలిపింది. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ 2007 ఐపిహెచ్‌ఎస్‌ ను ఆరోగ్య సంరక్షణ డెలివరీ నాణ్యతను మెరుగుపరచడానికి ప్రవేశపెట్టింది - మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరుల పరంగా. పనితీరు ఆశాజనకంగా లేదు. 75 శాతం ఆరోగ్య కేంద్రాలు నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి అని గొప్పలు చెపుతున్న వైద్యాధికారులు వాస్తవాన్ని కప్పి పుచ్చలేరు . అధిక ధర నిబంధనలకు కట్టుబడి ఉండటం వలన నేరుగా పిహెచ్‌సిలలో ప్రసూతి సంరక్షణ సౌకర్యాలను ఎత్తివేసింది తత్ఫలితంగా జిల్లాలో ఎంఎమ్‌ఆర్‌ల ప్రమాదాన్ని తగ్గించింది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో ఆరోగ్య సంరక్షణపై కేటాయింపు 1.5 శాతంగానే ఉంది.జన ఔషధిó యోజనతో సహా ఉచిత పథకాలు రోగులకు అందించడానికి ప్రభుత్వం అనేక పథకాలు చేసినప్పటికీ , వాస్తవంలో పరిస్థితి పెద్దగా మారలేదు . ఔషధాలను ఉచితంగా అందించడానికి వివిధ నిబంధనలు ఉన్నాయి, కానీ వాస్తవానికి, 60 శాతానికి పైగా రోగులు ఇప్పటికీ డబ్బు చెల్లించవలసి వస్తుంది. వంధ్యత్వ చికిత్సలు, నాన్‌-కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ మొదలైన అనేక స్కేలబుల్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, వీటిని ఆయుష్‌ హెల్త్‌కేర్‌ సర్వీసులను ఒకే గొడుగు కింద సహ-లొకేషన్‌ ద్వారా భారతదేశం అంతటా స్వీకరించవచ్చు, తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి వస్తుంది, జవాబుదారీగా, సరసమైనది మరియు అనుకూలీకరించబడింది గా ఉంటుంది . ఇక అంధత్వ నివారణ చికిత్సలు రాష్ట్రంలో చేపట్టక రెండు సంవత్సరాలవుతుంది. లయన్స్‌ క్లబ్‌, ఇతర ధార్మిక స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా లక్షలాది మందికి పైగా రోగులు ఉపశమనం పొందారు దాదాపు లక్షమంది వద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. చాలా సందర్భాల్లో బెంగళూరులో ఉన్న శంకర్‌ కంటి ఆసుపత్రి వారి పర్యవేక్షణలో లబ్ధి పొందారు. కరోనా మూలంగా ఎలాంటి శిబిరాలు లేకపోవడంతో చాలామంది వద్ధుల చూపు మందగించింది. ఆరోగ్య శ్రీ సేవలు కంటి ఆపరేషన్లకు విస్తరించక పోవడం వీరికి తీరని వ్యధగా మిగిలిపోయింది . అలాగే ఈ మధ్యనే కేంద్రం కంటి ఆపరేషన్లు చేసే నోడల్‌ ఏజెన్సీ లేదా రిజిస్టర్‌ ఎన్‌ జి ఓ లకు ప్రతి ఆపరేషన్‌ కు 2500 రూ పారితోషకం ఇవ్వలని అమెండ్మెంట్‌ జారీచేసిన జాతీయ అంధత్వ నిర్మూలన అధికారుల నుంచి సరియైన స్పందన లేదు.
 

(రచయిత,, రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా సైన్సు వేదిక)

డా. యం. సురేష్‌ బాబు