Nov 10,2023 00:27

ఆశీర్వాదం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఆండ్ర్ర మాల్యాద్రి తదితరులు

 తాడేపల్లి రూరల్‌: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతున్న మతోన్మాద బిజెపిని వ్యతిరేకించాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. గురువారం ఎంటిఎంసి పరిధిలోని ప్రాతూ రు సిపిఎం కార్యాలయం వద్ద, గ్రామ మాజీ సర్పంచ్‌ చొక్కా ఆశీర్వాదం 27వ వర్ధంతి సభ జరిగింది. సిపిఎం ప్రాతూరు గ్రామ శాఖ కార్యదర్శి డోకిపర్తి రాజేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మల్యాద్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆశీర్వాదం చిత్రపటానికి,సిపిఎం స్తూపా నికి సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకట్‌ రెడ్డి, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు పూలమాలవేసి, నివాళులర్పించారు. మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దేశానికి పెనుముప్పుగా మారిందని అన్నారు. రాబోయే ఎన్నికలలో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ చొక్కా ఆశీర్వాదం, డోకిపర్తి చలపతిరావులతో ఉన్న అను బంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రాతూరు, గుండి మెడ, చిర్రావూరులొ సుమారు 1000 కుటుంబాల వరకు ఇసుక క్వారీ లో పనిచేసేవారని, ప్రస్తుతం వారికి పని లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం కార్పొరేషన్‌ పరిధిలో ఉందని చెప్పి, అధి కారులు పేదల ఉపాధి హామీ పనిని తీసివేయడం అన్యాయ మన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి బత్తుల సంసోను, సిపిఎం నాయకులు ఎ.రామారావు, డి. కోటయ్య, రత్తయ్య, బుర్ర రాజు, రవి, శివయ్య, డోకిపర్తి దావీదు పాల్గొన్నారు.