Oct 10,2021 12:39

ఓ తరుణీ !
కమ్మని కాపురంలో
అనుబంధాల రాగాలతో
అల్లిబిల్లిగా అల్లుకున్న
ఆత్మీయతానురాగ తీగలు
ఆనందభైరవి ఆలపిస్తున్న వేళ
కరాళ కోరలతో
విశ్వమంతా విషవలయం సృష్టించి
మరణమృదంగం మోగిస్తున్న
మహమ్మారి
పతి ఊపిరి తీయబోతోంటే
మానవత కనుమరుగైన వేళ
మదిలో ఎగసివస్తున్న
దుఃఖాన్ని ఊరడిస్తూ
నిశిలోనూ మెరిసే శశిని కాంచి
సూర్యునికై ఎదురుచూసే పద్మంలా
ఆశలదీపం వెలిగించుకుంటూ
నీ బతుకు పుస్తకానికి
సిరాచుక్క అయిన మగని
ఊపిరి నిలిపేందుకు
భయాన్ని పారద్రోలి
ఊపిరినే పణంగాపెట్టి
నరనరాల్లో సత్తువ నింపుకొని
నోటితో ఊపిరిలూది
'కరోనా'తో సమరంలో
మృత్యువుతో పోరాడి
నమ్మకశిఖరం విరిగిపోయినా
'నాతిచరామి'కి అర్థమైనావు
ధన్యజీవిగా మిగిలావు
నీలాంటి ప్రాణసఖులు
ఈ కర్మభూమికి కావాలి
అందుకే గర్భస్థ ఆడశిశువు
హత్యలు నిరోధించాలి
 

వేమూరిశ్రీనివాస్‌
99121 28967