ప్రజాశక్తి-తాడేపల్లి : ఏలూరులో యాసిడ్ దాడిలో గాయపడి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యడ్ల ఫ్రాన్సికను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత పరామర్శించారు. ఫ్రాన్సికకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. బాధితురాలికి ప్రభుత్వం ఉద్యోగంతో పాటు సొంత ఇల్లు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో మూల ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలని విమర్శించారు. మొదట పరామర్శకు వెళ్తున్న టిడిపి మహిళా నేతలు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళలకు వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా మహిలా నేతలను అరెస్టు చేసి దుగ్గిరాల స్టేషన్‌కు తరలించి ఆపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంఓల కృష్ణవందన, కుసుమ, పుష్పలత, ఊర్మిల, ఉదయశ్రీ, కె.శైలజ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి దుగ్గిరాల : జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఆరోపించారు. ఏలూరులో నాలుగు రోజుల క్రితం యాసిడ్ దాడికి గురైన చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించేందుకు తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన తెలుగు మహిళలను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల మీద దాడికి కారణం గంజాయి అని రాష్ట్రం గంజాయి విక్రయాల్లో అగ్రస్థానంలో ఉన్నదని విమర్శించారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చి పది లక్షలు ఇచ్చామని చెప్పమన్నారు అని విమర్శించారు. బాధితురాలికీ ఏమైనా జరిగితే జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షులు షేక్ అషా ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి విజయలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయ సత్య ఎన్టీఆర్ జిల్లా నాయకులు దాసరి ఉదరుశ్రీ, తాడేపల్లి అధ్యక్షులు అన్నే కుసుమ, దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంనేని అనిత, వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఉన్నం ఝాన్సీ పాల్గొన్నారు.










