కడపప్రతినిధి : ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేస్తున్నాం. ఇందుకుగానూ సుమారు రూ.400 కోట్లతో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులపై దృష్టి సారించాం. చిన్న, మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో తక్కువ వ్యయంతో కూడిన డిస్ట్రి బ్యూటరీ పనులు చేపడుతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్దదైన మొగమేరు అక్విడక్ట్‌ను పూర్తి చేయడంపై దృష్టి సారించామని గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎం.మల్లికార్జునరెడ్డిని ప్రజా శక్తి కలిసిన సందర్భంగా ముఖాముఖి..
జిఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని ప్రాజెక్టుల గురించి తెలపండి?
జిఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో 11 ప్రాజెక్టులున్నాయి. గండికోట, గండికోట మెయిన్ కెనాల్, అలవలపాడు లిప్ట్, జిఎన్‌ఎస్‌ఎస్ హెచ్‌ఎన్ ఎస్‌ఎస్ లిఫ్ట్, సిబిఆర్- ఎర్రబల్లి లిఫ్ట్, గండికోట-సిబిఆర్- పైడిపాలెం అప్‌గ్రెడేషన్, మైక్రోఇరిగేషన్-సిబిఆర్, జికెఎల్‌ఐ, పిబిసి కెనాల్స్, సిబిఆర్, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం ప్రాజెక్టులున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల నీటి నిల్వల సామర్థ్యం ఎంత?
జిఎన్‌ఎస్‌ఎస్ సాగునీటి ప్రాజెక్టులు 52 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని జిఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని పలు రిజర్వాయర్లలో 38 టిఎం సిలు నిల్వ ఉన్నాయి.
డిస్ట్రిబ్యూటరీ పనుల వివరాలు తెలపండి?
జిఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ కింద 92 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 45 వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ సదుపాయాల కల్పనకు కృషి జరుగుతోంది. సర్వరాయసాగర్ కింద 25 వేలు, వామికొండ కింద 10 వేల ఎకరాలు, జిఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ 0 నుంచి 66 కిలో మీటర్ వరకు 10 వేల ఎకరాలు ఉంది. డిసెంబర్ నాటికి 35 వేల ఎక రాలకు నీటిసదుపాయం కల్పించడం జరుగుతోంది. ఇందుకు గానూ 60 కోట్లతో కూడిన పనులు చేపట్టడమైంది.
గండికోట పరిహారం చెల్లింపుల గురించి తెలపండి?
గండికోట నిర్వాసిత గ్రామాలైన ఫేజ్-1లో 14 గ్రామాలు, ఫేజ్-2లో నాలుగు గ్రామాలు, ఫేజ్-3లో మూడు గ్రామాలు వెరసి 21 గ్రామాల పరిధిలో 17,809 పిడిఎఫ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించడమైంది. ఇందులో తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి, పి.అనంతపురం, ఏటూరు, రేగడపల్లి, కె.సుగమంచిపల్లి గ్రామాల పరిధిలో 999 పిడిఎఫ్‌లకు సంబంధించి ఓటిఎస్ కింద రూ.10 లక్షలు, ఆర్‌అండ్‌ఆర్ కేటగిరీ కింద రూ.6.75 లక్షలు చెల్లించడమైంది. కొత్త రేటు ప్రకారం రూ.ఏడు లక్షలు నగదు, ఐదు సెంట్లు స్థలం కేటా యించడం జరుగుతోంది.
గండికోట పరిహారం విలువ ఎంత?
రూ.999 పిడిఎఫ్‌లకు సంబంధించి రూ.454 కోట్లు కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.గతంలో సిఎం ఇచ్చిన హామీ అమలులో భాగంగా రూ.454 కోట్లు తాజాగా విడుదల చేయడమైంది. త్వరలో పంపిణీ చేయడానికి సంబంధించిన కసరత్తు ఊపందుకుంది.
అదనపు ఆయకట్టు గురించి చెప్పండి?
జిఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలకు రూ.400 కోట్లు విడుదల చేస్తే జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల్లో మూడు లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని అందిస్తాం. ఇందులో పులివెందుల నియోజకవర్గ పరిధిలోనే 1.66 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంది. పులివెందుల పరిధిలోని 1.65 లక్షల ఎకరాల్లో 1.22 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్ కింద అందుబాటులోకి వస్తుంది. ఈమేరకు ప్రాజెక్టుల వారీగా డిస్ట్రిబ్యూటరీ నిర్మాణ పనులపై సర్వే చేపట్టాల్సి ఉంది.
సర్వరాయసాగర్ లీకేజీ పనుల సంగతేమిటి?
రూ.212 కోట్లతో సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచాం. ఇందులో లీకేజీ పనులకు సంబంధించి రూ.5.50 కోట్లు, వామి కొండ కింద రూ.6.6 కోట్ల వ్యయంతో కూడిన ప్రతిపాదనలు పంపిం చడమైంది. పాలనామోదం లభించింది. ఇందుకూరు గ్రామంలో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు ప్రయత్నం చేస్తున్నాం. టెండర్ దశను అధిగమించాం. వారం రోజుల వ్యవధిలో గ్రౌటింగ్ పనులు చేపడతాం.
మైక్రో ఇరిగేషన్ పనుల తీరుతెన్నుల గురించి వివరించండి?
రూ.1260 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ చేపట్టడమైంది. జికె ఎల్‌ఐ పరిధిలోని 800 సంపుల్లో ఇప్పటికి 120 సంపులు పూర్తి చేయడమైంది. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి సారించాం. ఎల్‌ఎ సం బంధించిన సమస్య కొనసాగుతున్నందున ఆలస్యంగా సాగుతోంది. ఏదే మైనప్పటికీ సాధ్యమైన మేరకు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాం.
మైలవరం రిజర్వాయర్ల కట్టల పునరుద్ధరణ ఎప్పుడో?
రూ.88 కోట్లతో ప్రతిపాదనలు పంపించడమైంది. రాష్ట్రప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. మైలవరం రిజర్వాయర్ పరిధిలోని 75 వేల ఎకరాలకు ఆయకట్టు నీరందిస్తాం. ఇందులో 55 వేల ఎకరాలకు సాగు నీటిని అందించడమైంది. చిత్రావతి రిజర్వాయర్ల కట్టలు కుంగిన మాట వాస్తవమే. ఎడమ వైపు ప్రొటెక్షన్ గైడ్‌వాల్ టెండర్ పిలిచే పనుల్లో నిగమ్న మయ్యాం. రివిట్‌మెంట్ ముందుభాగంలో 15 మీటర్ల ఎత్తు 300 మీటర్ల పొడవునా 10 లొకేషన్లలో రివిట్‌మెంట్ కుంగిన మాట వాస్తవమే. రీప్లేస్ చేయడానికి రూ.14 కోట్ల టెండర్లు పిలిచే పనుల్లో ఉన్నాం.
కాలేటివాగు ప్రాజెక్టు పురోగతిని వివరించండి?
: పిఎల్‌ఆర్ కాంట్రాక్టు సంస్థ రూ.5,0030 కోట్లతో టెండరును దక్కిం చుకుంది. రూ.4,300 కోట్ల పనుల్లో ఇప్పటి వరకు 20 శాతం పను లు చేపట్టింది. 2023 డిసెంబర్ నాటికి కాలేటివాగు పనుల్ని పూర్తి చేస్తాం. జిఎన్‌ఎస్‌ఎస్ నంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎత్తిపోతల పథకం పనులి వి. కడప జిల్లాలోని మొదటి భాగంలో భాగమైన కాలేటివాగు. కడప జిల్లాలో 40 వేలు, అన్నమయ్య జిల్లాలో లక్ష ఎకరాలు, చిత్తూరు జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలు వెరసి 2.90 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబా టులోకి రానుంది.
చిత్రావతి-ఎర్రబల్లి ఎత్తిపోతల పనుల పురోగతి తెలపండి?
రూ.850 కోట్లతో చిత్రావతి-ఎర్రబలి ఎత్తిపోతల పనులు చేపట్టాం. వేముల మండలంలోని గిడ్డంగివారిపల్లి దగ్గర పనులు జరుగుతున్నాయి. చిత్రావతి రిజర్వాయర్ నుంచి గిడ్డంగివారిపల్లి వరకు 48 కి.మీటర్ల పైప్‌లైన్ పనుల్లో నాలుగు కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశాం. రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాల్సి ఉంది. ఇందులో వేముల, వేంపల్లి ప్రాంతాల్లోని ఆరు చెరువులను నిం పా ల్సి ఉంది. అనంతరం వేంపల్లిలోని గిడ్డంగివారి పల్లి చెరువును నీటిని సర ఫరా చేయడం ద్వారా 10 వేల ఎకరాల అదనపు ఆయకట్టు లభించే అవ కాశం ఉంది. ఎర్రబల్లి ఎత్తిపోతల పనుల వల్ల యుసిఐఎల్ పరిధిలోని ఆరు నిర్వాసిత గ్రామాలకు శుద్ధ జలాన్ని అందిస్తాం.
రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉంది?
కడప జిల్లాలో రూ.11 వేల కోట్లతో రాయలసీమ డ్రౌట్ మిటిగే షన్ ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేశాం. సుమారు రూ.7,500 వేల కోట్లతో పనుల్ని చేపట్టడమైంది. దీంతో సుమారు 3.50 లక్షల ఎకరాల స్థిరీకరణకు అవకాశం ఉంది. ఐదు లక్షల మందికి తాగునీటిని అందించే అవకాశం ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో రూ.500 కోట్లతో జిఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ, రూ.650 కోట్లతో గండికోట లిఫ్టు స్కీమ్ పనుల తోపాటు మరో రూ.350 కోట్లతో ఇతర పనుల్ని చేపట్టడం జరిగింది.










