ప్రజాశక్తి-ఆలూరు
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య విమర్శించారు. శుక్రవారం వేదవతి ప్రాజెక్టును 8 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో మొలగవల్లి గ్రామం నుంచి ఆలూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆలూరు ప్రాంతంలో సాగు, తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. వేదవతి ప్రాజెక్టులో రూ.120 కోట్ల పనులు జరిగితే కేవలం రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపి వేశారన్నారు. వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా నాయకులు నబి రసూల్, భూపేష్, తిమ్మయ్య, మండల కార్యదర్శులు విరుపాక్షి, రామాంజనేయులు, హోతూరప్ప, ఎఐటియుసి తాలూకా కార్యదర్శి శివ పాల్గొన్నారు.
మొలగవల్లి గ్రామంలో పాదయాత్రను ప్రారంభిస్తున్న రామచంద్రయ్య










