Jun 30,2023 21:27

పులివెందుల అభివృద్ధిపై ముఖ్యమంత్రికి వివరిస్తున్న కలెక్టర్‌, ఎంపీ

కడప ; కడప జిల్లాలో త్వరగతితన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సిఎం వై.ఎస్‌. జగన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, జలవ నరుల శాఖ చేపడుతున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజరురామరాజు సిఎంకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. రూ. 5036 కోట్లతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి జిఎన్‌ఎస్‌ఎస్‌కు లిఫ్ట్‌ స్కీం పనులు పురో గతిలో ఉన్నాయని తెలిపారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద రూ. 1113 కోట్లతో చేపడుతున్న నిర్మాణ పనుల గురించి తెలియజేశారు. అలవల పాడులో రూ.56.83 కోట్లతో చేపడుతున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనులు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని చెప్పారు. మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో భాగంగా రూ.1256 కోట్లతో చేపడుతున్న 900 సంపుల నిర్మాణ పనుల గురించి వివరించారు. కాలేటివాగు రిజర్వాయర్‌కు సంబంధించి జిఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, సర్వారాయసాగర్‌, వామికొండ సాగర్‌ డిస్ట్రిబ్యూర్స్‌ కోసం ల్యాండ్‌ అక్విజేషన్‌ చేపట్టాలని అధికారులు తెలియజేశారు. పులివెందులలో రూ. 500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల పనుల పురోగతిని వివరించారు. స్కిల్‌ ట్రైనింగ్‌ అకాడమి, ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్‌్‌స, నగరవనం, న్యూటెక్‌ బయో సైన్సెస్‌ పనులు పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. సమీక్షలో కడప ఎంపీ వై.ఎస్‌. అవి నాష్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్‌, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ కుమార్‌, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ వి వినోద్‌ కుమార్‌, పాడా ఒఎస్‌డి అనిల్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.