Nov 05,2023 23:43

ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే బీసీల ఓట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడు

ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే బీసీల ఓట్లు
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : బీసీలకు ప్రాధాన్యత నిచ్చే రాజకీయ పార్టీలకే తాము ఓట్లు వేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడు స్పష్టం చేశారు. పట్టణం లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. నాగరాజుగౌడ్‌ మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా, ఆర్థికం గా వెనుకబడి ఉన్నారని చెప్పారు. నాయకులు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తు న్నారే తప్ప, రాజ్యాధికారం కల్పించే దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో 33 శాతం మహిళా వాటా కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బీసీ కులగణనకు ఆమోదం తెలపడం హర్షదాయకమన్నారు. రాబోయే ఎన్నికలలో బీసీలకు పెద్దపీట వేయాలనీ, అలాంటి పార్టీలకు మాత్రమే మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడిగా మఠం దినేష్‌ ను ఎన్ను కున్నారు. గురు సాయి, సోమశేఖర్‌ ఆచారి, మధుసూదన్‌ రావు, కిరణ్‌ కుమార్‌, బాల, శేఖర్‌ పాల్గొన్నారు.