కొమరాడ: ప్రాధాన్యతా భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ అన్నారు. మండలంలోని దుగ్గిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి చిన్నారులతో మాట్లాడారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసి రిజిస్టర్, జివికె కిట్లు, నాడు నేడు పనులను పరిశీలించారు. నాణ్యమైన విద్యాభోదన ఉండాలని, ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం పిల్లలకు అందించాలని ఎంఇఒను పిఒ ఆదేశించారు. అనంతరం కల్లికోటలో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలను పరిశీలించిన త్వరితగతిన పనులు పూర్తిచేయాలని పంచాయతీ రాజ్ డిఇఇ, ఇంజనీరింగ్ అధికారులను పిఒ ఆదేశించారు.










