పాలకొండ రూరల్ : ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. మండలంలోని అంపిలి, గోపాలపురం గ్రామాల్లోని సచివాలయ భవనాల పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ భవన నిర్మాణంలో నాణ్యత లోపించకూడదన్నారు. ఆఖరుదశలో ఉన్న భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి అప్పగించాలన్నారు. అనంతరం పాలకొండ నగర పంచాయతీలో ఆశ్రమ పాఠశాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పిఒ పరిశీలించారు. స్థల వివాదం కేసు కోర్టులో ఉన్నందున వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటామని అన్నారు. ఆమె వెంట గిరిజన సంక్షేమశాఖ ఇఇ సింహాచలం, డిఇ, ఎఇ, తహశీల్దార్ పి.సోమేశ్వరరావు తదితరులు ఉన్నారు.










