రాయచోటి : సెప్టెంబర్ మాసాంతంలోగా జిల్లాలో ప్రాధాన్యత భవనాలను పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో చేపట్టిన ప్రాధాన్యత భవనాల ప్రగతిపై పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ప్రాధాన్యత భవ నాలు ఎన్ని, ఎన్ని పూర్తి చేశారు, ఇంకా పూర్తి చేయాల్సినవి ఎన్ని, నిర్మాణ ఏజెన్సీలు నాణ్యతగా పనులు పూర్తి చేస్తున్నారా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా తదితర అంశాలలో ఇంజినీరింగ్ అధికారులను వివరాలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత భవనాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,118 ప్రాధాన్యత భవనాలు చేపట్టారని తెలిపారు. గ్రామ సచివాలయాలు 414 పూర్తి పూర్తి చేయాల్సి ఉండగా 216 పూర్తి చేశారని, ఆర్‌బికెలు 395 కు 187 పూర్తి చేశారని చెప్పారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ 309కి 137 భవనాలు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. ప్రాధాన్యత భవనాలకు సంబంధించి నిధుల కొరత లేదన్నారు. భవనాల నాణ్యతలో ఎక్కడ రాజీపడరాదని చెప్పారు. నిర్మాణ ఏజెన్సీలో నాణ్యతగా పనులు పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడూ తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా నిర్మాణ ఏజెన్సీలు సరిగా పనిచేయకుంటే వారిని తొలగించి నూతన ఏజెనీలకు పనులు అప్పగించాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలుంటే ఉన్నత స్థాయి దష్టికి తీసుకురావాలన్నారు. ఏరోజుకుకారోజు ప్రాధాన్యత భవ నాల ప్రగతిని మానిటరింగ్ సిస్టంలో నమోదు చేయాలని సూచించారు. లక్ష్యం మేరకు భవనాలు పూర్తి చేయడంలో బాధ్యతగా కషి చేయాలన్నారు. సమా వేశంలో పిఆర్ ఇంజినీరింగ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం, ప్రభుత్వ సేవలు అందిం చాలనే జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యమని కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ గిరీష తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జగనన్న సురక్ష, విద్యార్థుల గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ అంశాలపై జిల్లా అధికారులు ఆర్డీవోలు, మండల, నియో జకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, టాస్క్ ఫోర్స్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఇతర మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరి నోటి నుంచి ప్రభుత్వ పథకాల ఫలాలు అందలేదని మాట రాకూడ దన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష కార్యక్ర మం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు సేవలు అందించేలా అధికా రులు బాధ్యతాయుతంగా కషి చేయాలన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఇంటింటి సర్వే 100 శాతం పూర్తి కావాలన్నారు. ఎవరికి ఏ అవసరమో గుర్తించి వారికి సర్వీస్ రిక్వెస్ట్ నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా వాలంటీర్లు ఇంటింటి సర్వే చేయకుండా ఉంటే సంబంధిత తహశీల్దార్లు, ఎంపిడిఒలు వెంటనే సర్వే చేయించి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఒకవేళ వాలంటీర్ పోస్ట్ ఖాళీ ఉంటే మరొకరికి ఇన్‌ఛార్జి ఇచ్చి వెంటనే సర్వే చేయిం చాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను జగనన్న సురక్ష శిబిరాలలో పరిష్కరించాలని చెప్పారు. వివిధ కారణాలవల్ల పథకాలు అందకుండా మిగిలిపోయిన వారికి కూడా పథకాలు అందించాలని సదుద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రజా శ్రేయస్సు కోసం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్వే ప్రగతిపై మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో జీరో డ్రాప్‌ఔట్స్ ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం వివిధ అంశాలలో సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










