రాయచోటి : ప్రాధాన్యత భవనాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. శనివారం వివిధ ప్రభుత్వ పథకాల అమలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రాధాన్యత భవనాలు పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హౌసింగ్ కార్యక్రమం కింద స్టేజ్ కన్వర్షన్‌పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. నా నెల-నా దేశం (''మేరి మిట్టి, మేరా దేశ్'') ప్రచారం మన సాంస్కతిక మూలాలను, జాతీయ గుర్తింపును కాపా డుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే విధంగా జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హౌసింగ్ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ, రీసర్వే, జాతీయ రహదారులకు, టవర్లకు భూ సేకరణ, పీఆర్ ఆర్డీ కింద ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ, స్వామిత్ర, జాతీయ చేనేత దినోత్సవం, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, ఆడుదాం ఆంధ్ర, వైయ స్సార్ అచీవ్మెంట్ అవార్డులు, తదితర అంశాలపై సుదీరెంగా సమీక్షించి అధికా రులకు పలు సూచనలు ఇచ్చారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గిరీష, జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, హౌసింగ్ పీడీ శివయ్య, జిల్లా అగ్రికల్చర్ అధికారి చంద్రనాయక్, డిపిఒ ధనలక్ష్మి, విఎస్ డబ్ల్యూఎస్ ఎఒ మనోహర్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ప్రసన్నకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.










