Oct 08,2023 23:35

ప్రాచీన భారతీయ శాస్త్రీయ కళ భరత నాట్యం

ప్రాచీన భారతీయ శాస్త్రీయ కళ భరత నాట్యం
రౌండ్‌ టౌబుల్‌ సమావేశంలో
మేధావుల ఫోరం సభ్యులు
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ : మన దేశ కళ భరతనాట్యాన్ని నేటి తరం యువత, పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నాట్య గురువు మల్లికకు తమవంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని స్వచ్ఛ ఆంధ్ర సంస్ద చైర్‌ పర్సన్‌ పోణకా దేవ సేనమ్మ అన్నారు.గూడూరు పట్టణంలోని డీ.ఎన్‌.ఆర్‌ కమ్యూనిటీహాలులో జరిగిన కార్యక్రమంలో ఆమెతోపాటు డాక్టర్‌ రోహిణి పాల్గొని ''అలిగిరీ నందిని'' నత్యంతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసిన చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని డిఎన్‌ఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో శివ లలిత భరతనాట్య కళాక్షేత్రం సంస్థ అద్వర్యంలో భరతనాట్య కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.గూడూరుకు చెందిన పిండి మల్లిక అధ్వర్యంలో శివ లలిత భరత నాట్య కళాక్షేత్రం సంస్ద ప్రారంభో త్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిక ద్వారా శిక్షణ పొందిన కళాకారులు ఐసీఎండీఏ సంస్థ ద్వారా ప్రతిభ చాటి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశారు. దీంతో స్వచ్చఆంధ్ర సంస్ద చైర్‌ పర్సన్‌ దేవసేనమ్మ, మహిళా మండలి గౌరవాద్యక్షురాలు డాక్టర్‌ రోహిణిలు వారిని అభినందించి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర సంస్ద చైర్‌ పర్సన్‌ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ మన దేశ సంస్కతిలో భాగమైన భరతనాట్యాన్ని అభివద్ధి పరిచేందుకు మల్లికా చేస్తున్న కషి అభినంద నీయమన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు మురళిక్రిష్ణ, రోటరీ క్లబ్‌ మాజీ గవర్నర్‌ ముని గిరీష్‌,విశ్రాంత ప్రథాన అధ్యాపకులు, రచయిత టివిఎల్‌ ప్రసాద్‌,పిండి వెంకయ్య పాల్గొన్నారు.