Apr 08,2023 00:08
సమావేశంలో మాట్లాడుతున్న టి సాయిబాబా

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రాష్ట్రం నెలకొన్న పరిస్థితులను బట్టి ఆయా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని దానిని ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి లేదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రజా సంక్షేమం కోరుకునే ఏ పార్టీ అయినా పొత్తులకు సిద్ధపడుతుందని, నేడు మూడు రాజధానులు పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా చేశాడని, ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రంలో ప్రజలు విసిగెత్తి మార్పుకోసం ఎదురు చుస్తున్నారని అన్నారు. దేశంలో ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేయాలని బిజెపిని అనగలడా అని సాయిబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, టిడిపికి పట్టం కట్టే సమయం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, అధిన బసవపున్నయ్య, డొక్కు శ్రీనివాసరావు, ఇంతియాజ్‌, గొట్టిముక్కల లెనిన్‌ తదితరులు ఉన్నారు.