Feb 13,2023 23:01

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని జమ్మిచెట్టు సెంటర్‌లో ఎగుమతి దిగుమతి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ పున.ప్రతిష్ట కార్యక్రమం సోమవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ తెలుగు జాతి ఔనత్యం కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి మరువలేనిదన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. 60 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ విగ్రహాన్ని ఆధునికరించి పున:ప్రతిష్టించినట్లు చెప్పారు. త్వరలో ఈ వీధిని పొట్టి శ్రీరాములు వీధిగా నామకరణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌, పట్టణ కౌన్సిలర్‌ నూకల సాంబ, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ మానేపల్లి నాగబ్రహ్మం, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవానీప్రసాద్‌, వాణిజ్య విభాగం అధ్యక్షులు చారుగుండ్ల కొండ, ఎస్టి విభాగం అధ్యక్షులు బద్దు నాయక్‌, కార్మిక విభాగం అధ్యక్షులు గోగుల వెంకయ్య, నాయకులు చోడవరపు జగదీష్‌, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ తుమ్మేపల్లి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే టిడిపి ఎన్టీఆర్‌ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి శ్రీరాం రాజగోపాల్‌ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.