ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
ప్రజాశక్తి - చింతలపూడి
అమరవీరుల ఆశయాలు నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని మంచి నడవడిక అలవర్చుకోవాలని పొట్టి శ్రీరాములుకు మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ సభ్యులు సూర్యకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొటి శ్రీరాములు విగ్రహానికి మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.పాండు రంగారావు, డి.సత్యనారాయణ, ఆర్.ధర్మారావు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎంపిడిఒ కార్యాలయంలో, బుట్టాయగూడెం సచివాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ వాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు 1953లో రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం శాంతి, సర్పంచి తెల్లం వెంకాయమ్మ, యుపిఆర్‌డి శ్రీహరి, ఆర్‌డబ్ల్యూఎస్ మురళీకృష్ణ, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎన్‌ఆర్‌జిఎస్ ఎపిఒ ఆలీ, వెలుగు ఎపిఎం పద్మ, బుట్టాయగూడెం సచివాలయ సెక్రటరీ తెల్లం సూరిబాబు పాల్గొన్నారు.
భీమడోలు : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం పొలసానిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి షేక్ రహీమా బేగం హసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలను, త్యాగాన్ని పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు అంబటి దేవి, నాగేంద్రప్రసాద్, గ్రామ ఉపసర్పంచి జల్లా బాలకృష్ణ గ్రామపంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : మండలంలో గవరవరం మెయిన్ రోడ్డు మీద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహనికి గవరవరం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ చీమకుర్తి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు బిరుదుగడ్ల రత్నకుమారి, చప్పరావన్నగూడెం ఎంపిటిసి సభ్యులు సిహెచ్.కళావతి, జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యుడు బొమ్మ సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ బొమ్మ శ్రీను, మోత్కూరి శ్రీను, బొమ్మ గణేష్ పాల్గొన్నారు. మండలంలోని కన్నాపురంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విస్తారక్ సాయినాధ్‌రెడ్డి, కొత్త సతీష్, బొమ్మ మోహన్, ఇస్సాకోటి మంజునాథ, వీరేంద్ర, సాయి పాల్గొన్నారు.
జంగరెడ్డిగూడెం : పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం చేసిన ప్రాణత్యాగం స్ఫూర్తిదాయకమని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక బుట్టాయగూడెం రోడ్డు సెంటర్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చాట్రాయి : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహశీల్దార్ సిహెచ్.విశ్వనాధరావు మాట్లాడుతూ ఆయన ఆశయాలను సాధిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
దెందులూరు : కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శర్మ మాట్లాడుతూ విద్యార్థులు పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకుని కఠోరమైన దీక్షతో విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు పాల్గొన్నారు.










