పోయిన బంగారు నగలు అందజేత
- రైతు సంఘం నాయకుని కుటుంబ సభ్యులకు ప్రసంశలు
ప్రజాశక్తి కొత్తపల్లి
బంగారు నగలు పోగొట్టుకొని బాధపడుతున్న కుటుంబానికి రైతు సంఘం నాయకులు రాముడు కుమారుడు సోమేశ్వరుడు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. కొత్తపల్లి మండలంలోని ముసలమడుగు గ్రామానికి చెందిన కొండగుల మైరున్ బి గత సోమవారం కంటి ఆపరేషన్ చేపించుకునేందుకు నంద్యాల పట్టణానికి బయలుదేరింది. అయితే తన ఇంట్లో తన కుమార్తె బంగారు నగలు నక్లీసు కమ్మలు బుట్టాలు పట్టీలు మూడు తులాలకు పైగా ఉండడంతో ఆ నగలను ఆత్మకూరులో ఉన్న తన కుమార్తెకు షేక్ షహనాభి కి ఇవ్వాలని తీసుకొని పోతున్న తరుణంలో పోగొట్టుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో సింగరాజు పల్లి గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు రాముడు కుమారుడు సోమేశ్వరుడు తన వ్యవసాయ పొలంకు నీళ్లు పెట్టుకునేందుకు వెళ్తుండడంతో రోడ్డు పక్కన వైరు బుట్ట పడి ఉండడంతో అది తీసుకొని తన తండ్రి రాముడికి ఇవ్వడం జరిగింది. బంగారు నగలు ఆధార్ కార్డులు ఉండడంతో.. ఆధార్ కార్డు అడ్రస్ చూసి ముసలమడుగు గ్రామంలో ఉన్న తన బంధువులకు సమాచారం అందించారు. బంగారు నగలు పోగొట్టుకున్న సమాచారం తెలపడంతో మంగళవారం బాధితులు సింగరాజు పల్లి గ్రామానికి చేరుకొని రైతు సంఘం ఇంటి వద్దకు పోయి బంగారు నగలు తీసుకొని ధన్యవాదాలు తెలిపారు. రాముడి కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.










