Mar 11,2023 20:35

పోతుల నాగరాజును గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పోతుల నాగరాజును గెలిపించండి
- సిఐటియు, బిసి సంఘం నాయకులు
ప్రజాశక్తి - బనగానపల్లె

         పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బిసి సంఘం జిల్లా నాయకులు పాండురంగ యాదవ్‌, సిఐటియు డివిజన్‌ కార్యదర్శి జెవి సుబ్బయ్యలు కోరారు. శనివారం బనగానపల్లె మండలంలోని పలుకూరు, చెరువు పల్లె గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోతుల నాగరాజును గెలిపించాలని సిఐటియు, బిసి సంఘం, యాదవ సంఘం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్‌ మద్దయ్య యాదవ్‌, మండల ప్రధాన కార్యదర్శి శంకర్‌ యాదవ్‌, నాయకులు కుమారస్వామి యాదవ్‌, రామ పుల్లయ్య యాదవ్‌, శ్రీనివాసులు యాదవ్‌, వెంకటేశ్వర్లు యాదవ్‌, జానకిరామ్‌ యాదవ్‌, రామ వెంకటేశ్వర్లు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. పాణ్యం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిఐటియు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ, ప్రజాసంఘాల నాయకులు కోరారు. మండలంలోని పాణ్యం, కొండ జూటూరు, గోరుకల్లు, భూపనపాడు, మద్దూరు, కందికాయపల్లె, ఆలమూరు, గోనవరం గ్రామాలలో పోతుల నాగరాజకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకష్ణ సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్‌ ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ వనం వెంకటాద్రి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కేజే శ్రీనివాసరావు విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్‌ అనిల్‌ మనోహర్‌ రమేష్‌ కుమార్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.